అందరి పట్ల భద్రత మరియు గౌరవం
Uber' సంఘం మార్గదర్శకాలు
ప్రతి అనుభవాన్ని సురక్షితంగా, గౌరవపూర్వకంగా మరియు సానుకూలంగా మార్చడంలో సహాయపడటానికి మా మార్గదర్శకాలను రూపొందించాము.
డ్రైవర్లు, రైడర్లు, డెలివరీ పార్టనర్లు, Uber Eats వినియోగదారులు, వ్యాపారులు మరియు ఏవైనా Uber ఉత్పత్తులను ఉపయోగించే వ్యాపారాలతో సహా మా యాప్‌లన్నింటిలో Uber ఖాతా కోసం సైన్ అప్ చేసుకునే ప్రతి ఒక్కరూ అధికార పరిధి ప్రకారం వర్తించే పరిధి మేరకు మార్గదర్శకాలను అనుసరించాలని ఆశిస్తున్నాము. గ్రీన్‌లైట్ హబ్‌లలో పని చేస్తున్న Uber ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లతో ఆన్లైన్ సిస్టమ్‌ల ద్వారా లేదా ఫోన్ ద్వారా జరిగే పరస్పర చర్యలకు కూడా ఇవి వర్తిస్తాయి.
ఈ విభాగంలోని మార్గదర్శకాలు ప్రతి అనుభవం సమయంలో మా విభిన్న సమాజంలో సానుకూల పరస్పర చర్యలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
ప్రతి ఒక్కరికీ సురక్షితమైన అనుభవాలను సృష్టించడంలో సహాయపడటానికి మా బృందం ప్రతిరోజూ కృషి చేస్తోంది. అందుకోసమే ఈ ప్రమాణాలను రచించాము.
మేము చట్టాన్ని అనుసరించడానికి కట్టుబడి ఉన్నాము. మా యాప్‌లను ఉపయోగించే ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, అలాగే వర్తించే చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలని మేము ఆశిస్తున్నాము.
మీ ఎంపికల సామర్ధ్యం
ప్రతిరోజు లక్షలాది మంది వ్యక్తులు Uberతో ఉన్నతమైన అనుభవాలను పొందుతున్నారు. ఈ సానుకూల వ్యవహార శైలి మనం ఎవరో తెలియజెప్పడంలో సహాయపడుతుంది. Uberను సురక్షితమైన, స్నేహపూర్వకమైన సంఘంగా తీర్చిదిద్దడంలో సహాయపడుతున్నందుకు మీకు ధన్యవాదాలు.
మీ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తాము
ఏదైనా జరిగితే, అది మంచైనా లేదా చె డైనా, మీరు సులభంగా చెప్పుకోగలిగే సదుపాయం కల్పిస్తాము. మా బృందం నిరంతరం మా ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. అదేవిధంగా, మీ ఫీడ్‌బ్యాక్ కూడా మాకెంతో ముఖ్యం, అప్పుడే మేము తగిన చర్యలు తీసుకుని, అభివృద్ధి చెందుతున్న మా సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మా ప్రమాణాలను నిర్దేశించగలుగుతాము.
మీరు సంఘటనను నివేదించాలనుకుంటే, మా యాప్ ద్వారా మమ్మల్ని సం ప్రదించవచ్చు లేదా కాల్ చేయవచ్చు లేదా help.uber.comని సందర్శించవచ్చు. మీరు తక్షణ ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తే, Uberకు తెలియజేసే ముందు మీ స్థానిక అధికారులను అప్రమత్తం చేయండి.